Sunday, November 13, 2016

అద్దాలమేడ2

               హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ?నా అద్దాలమేడ రెండో Episode కి వచ్చాము, అలా ఊరిలో Software పరిస్తితి ఉంటె అంతా తెల్సిన మన ఫ్రెండ్స్ పరిస్తితి ఎలా ఉందొ ఈ రోజు చూద్దాం. ఒక ఫ్రెండ్ ఉంటాడు, తను చేసే job software కాదు, So ఈ సాఫ్ట్వేర్ వాడ్ని చూసి ఏందీ మామ నికేంటి చెప్పు పెద్ద జాబు వారానికి 2 డేస్ Holidays ఎంజాయ్ చేస్తున్నావ్ లైఫ్ ని. నేను ఒకటే అనుకుంటున్నాను జీవితం లో చాల మంది software job ఉంటె చాలు ఇంకేమి వద్దు మన ఈ జాబ్స్ అన్ని వేస్ట్ అని ఎందుకు ఫీల్ అవుతారో నాకర్ధం కాదు.


                                ఫ్రెండ్స్ ఒకవిషయం చెప్పనా....ఒక గొప్ప వ్యక్తీ చెప్పిన మాట నాకు చాల ఇష్టం. "ఎదుటి వారి లైఫ్ తో నిన్ను compare చేసుకోకు, వాళ్ళ ని నువ్ బయటినుండి మాత్రమె చూస్తున్నావ్ వాళ్ళ అంతరం లో ఎన్ని బాదలున్నాయో నీకు తెలియదు". అలానే ని job ని నువ్వు ఇష్టపడు నీకు నచ్హలేద నికిస్టంయిన field కి వెళ్ళటానికి ప్రయత్నించు, అంతేగాని ఎవరో చెప్పారు అందులో ఎదౌ ఉంది 2 డేస్ Holidays ఉంటాయి ఇలా అనుకోవద్దు.


                               ఫ్రెండ్స్ నేనేదో ఈ software field మంచిది కాదు ఇందులోకి రావొద్దు అని నేను మీకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈ software field అనేదే లేకపోతె మన ధయినందన జీవితమే లేదు, నాకు మాత్రమె ఇష్టం లేదు అని చెప్పదలుచుకున్నాను and ఇంకో విషయమేమిటి అంటే ఎంతో తెలివి గల్ల నా ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్ లోనే లైఫ్ అంత ఉందని వాళ్ళ కి ఉన్న ఎంతో Talent ని Time ని వృధా చేస్తున్నారనే చిన్న బాధ తో నాకు నేను రాసుకుంటున్నాను.


                                    ఇప్పుడున్న generation లో ప్రతి ఇంట్లో ఇదే సమస్య, వాళ్ళ అబ్బాయి కి ఆఆ కంపెనీ లో జాబు వచ్చిందట కదా నువ్వు కూడా అందులో ట్రై చేయొచ్చు కదా, అస్సలు వాడు చదివిన్దేంటి వీడు చదివిన్దేంటి అని ఆలోచించరు, వాడికి పెద్ద job వచ్చింది వీడికి రావాలి అంతే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడి పేరు చెప్పదలుచుకోలేదు, వాడు ఇది చదివితే వాడికే అర్ధమవుతుంది, వాడికి ఎంతౌ Tallent ఉంది, వాడికి Groups లాంటివి రాస్తే చాలా Easy గ వస్తుంది కాని వాడికి Software job మాత్రమే కావాలి, వాడికి అదంటే చాలా ఇష్టమా అది కాదు అందులో ఎదౌ ఉంది అనే చిన్న పిచ్చి వాడికి, నేను వాడ్నేదో తక్కువ చేద్దామని చెప్పట్లేదు, నా ముందు ఎంతో talent ఉన్న నా ఫ్రెండ్ వాడి bright futer ని Miss అవుతున్నాడు అని చిన్న బయం తో ఇలా రాసుకుంటున్నాను.


                              ఫ్రెండ్స్ ఒక మంచి మాట చెప్పి ఈ అద్దాల మేడ ని End చేస్తున్నాను. ''ఒకడు నిస్సహాయం గ దేవుడ్ని తిడుతున్నాడు, వాడికి Car ఇచ్హావు వీడికి పెద్ద Job ఇచ్హావ్ ఇన్ని రోజులయింది నాకు మాత్రం ఏమి లేదు నేను కాలి గ ఉన్నాను అని అంటున్నాడు, ఒకతను వచ్చి బాబు 1 Lakh ఇస్తాను ని ఒక చెయ్యి ఇస్తావా అన్నాడు అప్పుడు వీడు బాబొఇ నేను ఇవ్వను అన్నాడు, సరే 2 Lakhs ఇస్తాను ని కాలు ఇస్తావా అన్నాడు, మల్లి వాడు బబొఇ నేన నువ్వెంతిచ్చిన నా బాడీ లో ఏ Part ఇవ్వను అన్నాడు, అప్పుడతను ఇంత విలువయినవి నీకు దేవుడిస్తే ఇంకా ఏమి ఇవ్వలేదని అంటావే అని వెళ్ళిపోయాడు" . So ఫ్రెండ్స్ ఎప్పుడు మనకి అది లేదు ఇది లేదు అని ఫీల్ అవ్వొద్దు ప్లీజ్...... OK నా ఉన్న దాంతో హ్యాపి గ ఉందాము ఇంకా లైఫ్ చాలా ఉంది......Thanks 




Your 's ........సతీష్.

Unfortunately I lost my old blog password and created new blog with old posts.

No comments:

Post a Comment